పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారుండారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకులకు పండుగ అనే చెప్పాలి. ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.
పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG'  సినిమాను rrr ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నియమితులవ్వడంతో కొంచెం బిజీ అయిపోయారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేరళలోని అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లారు. ఆయనతో పాటుగా ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా వెళ్లాడు. ఈ ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. అలాగే ఆయన తమిళనాడు లోని ఇతర ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించనున్నారు.
అయితే ఈ అగస్త్య మహర్షి ఆలయం ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. ఈ ఆలయం ఎర్నాకుళం జిల్లాలోని కురీకాడ్‌లో ఉంది. ఈ గుడి ఆయుర్వేద వైద్యానికి నిలయం అంట. ఈ ఆలయంలోనే దాదాపు 13 చిన్న ఆలయాలు కూడా ఉన్నాయట. ఈ మందిరంలో అగస్త్య మహర్షి ప్రతిమ ఉంటుందని.. అందుకే దీన్ని అగస్త్య ఆలయం అని పిలుస్తారు అంట. ఈ ఆలయంలో ఆరోగ్యకరమైన మూలికలతో ప్రసాదం తయారు చేస్తారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: