![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/bigboss-beauty-performance-in-ismart-jodi-c0a76807-45e7-407c-a948-b724b1d5bff6-415x250.jpg)
ఇక సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. అయితే షోలోకి సోనియా తో అడుగుపెట్టిన యష్ మాట్లాడుతూ.. తనకి తన చెల్లి శ్వేత అంటే చాలా ఇస్తామని చెప్పారు. తనకోసమే యష్ ఫారిన్ కి వెళ్లి చదువుకుని.. సెటిల్ అయ్యి తనకి పెళ్లి చేశానని అన్నారు. ఒక్క సంవత్సరం క్రితమే ఆమె చనిపోయిందని యష్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం సోనియా కూడా ఎమోషనల్ అవుతూ.. 'శ్వేతమ్మ ని అంతా కాకపోయినా, నా వరకు ఎంత అయితే అంతా నేను ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటాను' అని చెప్పుకొచ్చింది.
ఇక సోనియా బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ అడుగు పెట్టింది విషయం తెలిసిందే. ఈమె బిగ్ బాస్ హౌస్ లో నాలుగైదు వారాల్లో ఉన్నప్పటికీ చాలా మందికి తెలిసిపోయింది. ఎందుకంటే ఈమె బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. సోనియా ఆకుల ఆర్జీవి సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఈమె ఒక స్వచ్చంధ సేవా సంస్థ కూడా నడిపిస్తుంది. ఈమె బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక యష్ ని పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ షోలో కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ షోలో సోనియా తన భర్తతో ఇరగదిస్తుంది. టాస్క్ లలో ఇచ్చి పడేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రేరణ కూడా శ్రీపాద్ తో కలిసి తగ్గేదె లే అంటూ ముందుకు సాగుతుంది.