మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందం నటిస్తున్న బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన పాల్గొన్న ఈవెంట్ కి ఆయన మాట్లాడిన మాటలకి ఎలాంటి పొంతన లేదు. దీంతో పొంతనలేని మాటలు మాట్లాడిన చిరంజీవిపై చాలామంది ఫైర్ అవుతున్నారు. ఇంత ఏజ్ కి వచ్చారు ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా తెలియదా..ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు కనీసం స్టేజ్ పై ఎలా ఉండాలో కూడా తెలియని చిరంజీవిని మెగాస్టార్ అని అంటారా అంటూ చాలామంది ఈయనపై ఫైర్ అవుతున్నారు. అయితే బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి సంబంధం లేని మాటలు మాట్లాడారు. ఆ ఈవెంట్లో మా ఇల్లు ఓ లేడీస్ హాస్టల్ లా ఉందని నేను అందులో హాస్టల్ వార్డెన్ లా ఉన్నానని ఇంట్లో అందరూ అమ్మాయిలే అని కనీసం రాంచరణ్ కైనా కొడుకు పుడతాడు అనుకుంటే కూతురే పుట్టింది. 

కానీ నెక్స్ట్ టైం రామ్ చరణ్ ని ఖచ్చితంగా నాకు మనవడే కావాలని అడుగుతాను. ఎందుకంటే మెగా లెగసీని ఇండస్ట్రీలో కొనసాగించాలంటే ఒక్క వారసుడైన కావాలి కదా అంటూ మెగాస్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇక మెగాస్టార్ వ్యాఖ్యలపై చాలామంది ఫైర్ అయ్యారు. కొడుకు ఒక్కడే వారసుడా.. కూతురు వారసురాలు కాదా..ఇంత పెద్ద స్టార్ అయ్యుండి మీరు కూడా లింగ వివక్షత చూపిస్తే ఇక మామూలు వాళ్ల పరిస్థితి ఏంటి.. మన దేశం మొత్తం పాలించిన ప్రధాని ఇందిరా గాంధీ అని మీకు తెలియదా.. కొడుకులైతేనే వారసత్వాన్ని కొనసాగిస్తారా.. కూతుర్లు ఆ పని చేయలేరా అంటూ చాలామంది ఈయనపై ఫైర్ అవుతున్నారు.

ఇక చిరంజీవి మాటలపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కచ్చితంగా చిరంజీవి మాట్లాడిన మాటలపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ డిమాండ్ చేస్తుంది. ఆయన మాటలు ఇంత వివాదాస్పదం అయ్యాక కూడా చిరంజీవి కనీసం స్పందించడం లేదు.మరి చిరంజీవి ఇప్పటికైనా స్పందించి ఆ మాటలు మాట్లాడినందుకు క్షమాపణలు చెబుతాడా లేక ఈ వివాదాన్ని ఇలాగే పెద్దది చేస్తాడా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: