పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా గుళ్ళు గోపురాలు అంటూ సనాతన ధర్మం అంటూ ఆధ్యాత్మిక భావనతో ఉంటూ తాజాగా తన కొడుకు అకిరానందన్ తో కలిసి కేరళలో ఉన్న అగస్త్య మహర్షిని దర్శించుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం బాలేదని, ఆయనకి జ్వరం వచ్చిందని తీవ్రమైన వెన్నునొప్పుతో బాధపడుతున్నారని వార్తలు వినిపించాయి. అయితే గత 15 రోజుల నుండి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ బాధ్యతలు పక్కన పెట్టి సినిమాలను కూడా పక్కన పెట్టి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటూ గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతున్నారు. ఇక రీసెంట్ గా చంద్రబాబు ఫోన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదని,తిరిగి రిటర్న్ కాల్ కూడా చేయలేదని అసలు పవన్ మనసులో ఉన్న అంతరార్థం ఏంటి అని చాలా వార్తలు మీడియాలో వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 అయితే పవన్ కళ్యాణ్ తీర్థయాత్ర నేపథ్యంలో తాజాగా ఓజీ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది.అయితే చాలా రోజుల నుండి ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ వేరే సినిమాలు చేయకుండా పవన్ కళ్యాణ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకుండా ఓవైపు రాజకీయాలు మరోవైపు గుళ్ళు గోపురాలు అంటూ తిరగడంతో ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతూ పవన్ పై ఫైర్ అయినట్టు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారికి తీర్థయాత్రలు చేయడానికి టైం ఉంటుంది కానీ సినిమాకి టైం కేటాయించడానికి టైం ఉండదా అని అసహనం వ్యక్తం చేశారట.

ఇక హరిహర వీరమల్లు సినిమాకి డేట్స్ ఇచ్చినప్పటికీ ఓజి సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వలేదు. దీంతో సుజిత్ చాలా ఇబ్బందులు పడుతున్నారట.అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం సుజిత్ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాను కూడా వదులుకున్నారట. అలా అంత బాలీవుడ్ స్టార్ హీరోని వదులుకొని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తే తనని మాత్రం పవన్ పట్టించుకోవడంలేదని ఓజి  డైరెక్టర్ సుజిత్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు ఫిలింనగర్ ఓ వార్త చక్కర్లు కొడుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: