తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ రఘుబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వందలాది చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రఘుబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపు అందుకున్నారు. ఈయన కుటుంబం కూడా సెలబ్రెటీ కుటుంబమే. రఘు బాబు తండ్రి పేరు గిరిబాబు ఈయన కూడా నటుడుగా ఎన్నో చిత్రాలలో నటించి భారీ క్రేజ్ అందుకున్నారు. రఘు బాబు కుమారుడు  కూడా తెలుగులో హీరోగా నటించిన కలిసి రాలేదు.



ఇటీవల బ్రహ్మానందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రఘుబాబు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది. తన జీవితంలో కీలకమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తి గురించి తెలియజేస్తూ ఎమోషనల్ గా మాట్లాడారు. రఘు బాబు ఇప్పటివరకు 400 సినిమాలలో నటించారని అందులో అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమా కూడా ఒకటని.. బన్నీ సినిమా సక్సెస్ మీట్ లో తనను ఎవరూ పట్టించుకోలేదని.. స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా సినిమాలో కనిపించిన వారు కనిపించారు మెచ్చుకోవడం జరిగింది.. కానీ తన పేరు ఎవరు తీయలేదని తెలిపారు.

డైరెక్టర్ వివి వినాయక్ గారు కూడా ఏంటయ్యా నువ్వు ఈ సినిమాలో ఇంత బాగా నటిస్తే ఎవరు నీ పేరు చెప్పడం లేదని అడిగారని.. అలాంటి సమయంలోనే చిరంజీవి గారు స్టేజ్ పైన తన పేరు చెబుతూ పొగడడంతో తనకు ఒక గుర్తింపు లభించిందని ఆనందపడ్డానని తెలిపారు. ఆయన చెప్పిన మాటలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన తన పేరు పొగడడం వల్లే 400 సినిమాలలో నటించానని తెలిపారు రఘుబాబు. ఎప్పటికీ చిరంజీవి గారి రుణం తీర్చుకోలేను అంటూ కూడా తెలియజేశారు రఘుబాబు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: