మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. త్రిష ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మొదట ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆ తర్వాత ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేయడం లేదు అని 2025 వ సంవత్సరం సమ్మర్ కానుకగా ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని మే 9 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది అనే ఓ వార్త తెగ వైరల్ అయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఓ న్యూస్ ఫుల్ వైరల్ గా మారింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన అనేక గ్రాఫిక్స్ పనులు పెండింగ్లో ఉన్నట్లు , దానితో ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని ఈ సంవత్సరం సమ్మర్ వరకు కంప్లీట్ కావు అని , దానితో ఈ సినిమా ఈ సంవత్సరం సమ్మర్ కు విడుదల కావడం కష్టం అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ సంవత్సరం సమ్మర్ కి ఈ సినిమా రాదు అనే వార్తలు వైరల్ కావడంతో బాగా ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: