![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/kamalhasan3edf1c25-7aac-49ef-a4e8-a9a6747cf06d-415x250.jpg)
భామనే సత్యభామనే సినిమాలో కమల్ నటించిన రుక్మిణి పాత్ర అందరికి గుర్తుండే ఉంటుంది.. ఆ పాత్రని కమల్ అద్భుతంగా పోషించారు.. ఎక్కడ కూడా సహజత్వం లేకుండా న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో కమల్ ఆకట్టుకున్నారు.. ఇక అలాగే కమల్ నటించిన దశావతారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. 10 పాత్రలలో కమల్ తన నట విశ్వరూపం చూపించారు.. ఈ 10 పాత్రలలో బామ్మ పాత్రకు విశేషమైన స్పందన లభించింది. పాత కాలపు బామ్మ పాత్రలో కమల్ జీవించారు..
చాదస్తం వున్న బామ్మ లా నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.బామ్మ గెటప్ కమల్ కి సరిగ్గా సరిపోయింది.. ఆ పాత్ర కమల్ తప్ప మరెవరు చేయలేరంత అద్భుతంగా నటించారు.. స్టార్ హీరోగా ఇంత క్రేజ్ వున్న కమల్ వైవిధ్యమైన పాత్రలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు..ఆయన కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు చేసి ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు.. పాత్ర ఏదైనా సహజంగా నటించడం కమల్ నైజం అందుకే ఆయన సినిమాకోసం ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడతారు..