![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/vishwak-senadccab53-f3d0-4de8-8eb2-7f4ad612304f-415x250.jpg)
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే లైలా మూవీకి బుకింగ్స్ మొదలు కాగా అర్బన్ ఏరియాలలో బుకింగ్స్ బాగున్నాయి. బీ, సీ సెంటర్లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ పుంజుకోవాల్సి ఉంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఎ సర్టిఫికెట్ ఇవ్వగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని భావించే ప్రేక్షకులకు ఈ నిర్ణయం ఒక విధంగా షాక్ అని చెప్పవచ్చు. లైలా సినిమాతో విశ్వక్ సేన్ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.
వైసీపీ నేతలను టార్గెట్ చేసే డైలాగ్స్ వల్ల విశ్వక్ సేన్ లైలా సినిమాకు ఊహించని స్థాయిలో పబ్లిసిటీ జరిగిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. అయితే లైలా సినిమా ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది. సెలక్టివ్ గా సినిమాలను నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ నిర్మాతలు లైలా సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని భావిస్తున్నారు. లైలా సినిమాపై తమ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
లైలా సినిమాకు సంబంధించి ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. విశ్వక్ సేన్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. విశ్వక్ సేన్ తర్వాత సినిమాల బడ్జెట్, కలెక్షన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.