![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/akhil-zainabe41c49a1-202e-493d-bd38-120aacef2f34-415x250.jpg)
స్టార్ సెలబ్రిటీస్ ఎలా పెళ్లిళ్లు చేసుకుంటారు అనేది అందరికీ తెలిసిందే . ప్రతి పనికి ఒక్క రోజుని కేటాయిస్తూ ఫుల్ గా డబ్బులు కుమ్మరించేస్తూ ఉంటారు. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టేస్తారు. కేవలం ఫంక్షన్ హాల్ కోసం డెకరేషన్ కోసం కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు . ఇక హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా మీడియా వాళ్ళను పిలిపించి రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . అయితే అలా కాకుండా చాలా డిఫరెంట్గా పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యాడట అక్కినేని అఖిల్.
గతంలో పెళ్లిళ్లు గ్రాండ్ గా చేసుకోవడం వల్లనే ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని.. ఆ కారణంగానే చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యాడట అక్కినేని అఖిల్. రీసెంట్ గానే జైనబ్ రవ్జీ తో నిశ్చితార్ధం చేసుకొని ఆ ఫోటోలను షేర్ చేశాడు అక్కినేని అఖిల్ . దీంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నింది. అమల ఆనందానికి అయితే అవధులు లేవు. కాగా వారాలు అవుతున్న న్యూస్ ప్రకారం మార్చి 24వ తేదీ అఖిల్ - జైనబ్ రవ్జీల పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది .
అంతేకాదు వీళ్ళ దుబాయ్ లో ఒక బిగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారట. కాగా చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత సింపుల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల చేసుకున్న విధంగా పెళ్లి చేసుకుని దుబాయ్లో మాత్రం గ్రాండ్ గా బిజినెస్ - పొలిటికల్ స్టార్స్ అందరికీ రిసెప్షన్ ఇవ్వబోతున్నారట. ఇది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. ఇంత సింపుల్గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా..? అది కూడా ఒక అక్కినేని వారసుడు . నిజంగా గ్రేట్ అంటున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ అక్కినేని - అఖిల్ పెళ్లి వార్త బాగా మారుమ్రోగిపోతుంది..!