సాధారణంగా పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మిస్ చేసుకోదు . అది అందరికీ తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశమస్తే బుద్ధున్న ఏ హీరోయిన్ అయినా మిస్ చేసుకుంటుందా..? నో వే అది ఎప్పటికీ జరగదు . అయితే ఒక హీరోయిన్ మాత్రం మిస్ చేసుకునింది. ఆ కారణంగానే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ హీరోయిన్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.  కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం ఆమెతో నటించాలి అనే కోరిక అలాగే ఉండిపోయింది.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  న్యూస్ ప్రకారం త్వరలోనే ఆ కోరిక తీరబోతుంది అంటూ కూడా తెలుస్తుంది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..? మరి ఎవరో కాదు ..తన యాక్టింగ్ తో తన అందచందాలతో సౌత్ ఇండియాలోనే క్రెజీయస్ట్ హీరోయిన్గా పాపులర్టీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ "నయనతార". ఎస్ నయనతార - పవన్ కళ్యాణ్ కాంబోలో ఒక్క సినిమా అయినా పడాలి అంటూ చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ అవకాశం రాలేదు. అంతేకాదు నయనతార ని పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసింది .

దానికి కారణాలు వేరే ఉన్నాయి . అయితే పవన్ మాత్రం నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. నయనతారతో పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట . అది కూడా ఒక బిగ్ బడా మూవీలో . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నాడో పొలిటికల్ పరంగా తెలిసిందే. అయితే ఆల్రెడీ ఆయన కమిట్ అయిన సినిమాలోని  ఓ రోల్ కోసం నయనతారను చూస్ చేసుకున్నారట . పవర్ఫుల్ రోల్ కావడంతో నయనతార కూడా యాక్సెప్ట్ చేసిందట . అంతా అనుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే లోపే నయనతార - పవన్ ల కాంబో ని మనం చూసేయొచ్చు అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: