నట కిరీటి రాజేంద్రప్రసాద్ తన నటనతో ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నారో చెప్పనక్కర్లేదు. అలా కామెడీ సినిమాల్లో ఎక్కువగా నటించిన రాజేంద్రప్రసాద్ కామెడీ హీరో గానే పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అయితే  వయసు మీద పడడంతో తాత తండ్రి పాత్రలు పోషిస్తున్న రాజేంద్రప్రసాద్ అప్పట్లో కామెడీ హీరోలలో స్టార్ హీరోగా వెలుగొన్నారు.ఇక ఈయన వందల కొద్ది సినిమాల్లో హీరో పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈయన సినిమాలు చూసి కడుపుబ్బా నవ్వుకునేవారు. అలా అప్పుడు స్టార్ హీరోలైన రంభ, సౌందర్య, ఆమని, రాశి వంటి ఎంతో మంది హీరోయిన్లతో ఈయన జతకట్టారు. అయితే అలాంటి రాజేంద్ర ప్రసాద్ పూర్తిస్థాయి లేడి గెటప్ లో నటించిన సినిమా మేడమ్..

ఈ సినిమాలో తన ఫ్రెండు బామ్మ చనిపోకుండా ఉండడం కోసం తన ఫ్రెండ్ కి లవర్ పాత్రలో లేడీ గెటప్ వేసుకొని కనిపిస్తాడు.ఇక లేడి గెటప్ లో సరోజినీ  పాత్రలో రాజేంద్రప్రసాద్ చాలా అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ గెటప్ కి చాలామంది ఫిదా అయ్యారు. అచ్చం అమ్మాయిని పోలి ఉన్న గెటప్ తో ఈయన హాట్ ఆంటీలా అందరినీ నవ్వించారు. ఇక ఈ సినిమా టెలివిజన్లో ఇప్పుడు వచ్చినా కూడా చాలామంది ప్రేక్షకులు ఇష్టంగా చూస్తారు.

అలా రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్ లో నటించిన ఈ సినిమాకి గాను ఈ హీరోకి ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా వరించింది. కేవలం మేడమ్ సినిమాలో మాత్రమే కాకుండా ఆల్ రౌండర్ సినిమాలో కూడా లేడీ గెటప్ లో నటించారు రాజేంద్ర ప్రసాద్.ఈ సినిమాలో హీరోయిన్గా సంఘవి నటించింది.అయితే పొగరు గల సంఘవి ప్రేమను పొంది ఆమె పొగరుని వంచడం కోసం రకరకాల గెటప్ లు వేసుకుంటూ అందులో భాగంగా లేడీ గెటప్ కూడా వేసుకుంటాడు రాజేంద్రప్రసాద్.అలా రాజేంద్రప్రసాద్ ఇప్పటివరకు రెండు సినిమాల్లో లేడీ గెటప్ వేసుకొని నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: