సాధారణంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు విడుదలైతే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయనే సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ కిరణ్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాగా జోడీ నంబర్1 నిలిచింది. 2003 సంవత్సరం మార్చి 7న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఒక విధంగా ఫెయిలైందని చెప్పవచ్చు.
 
వేన్య హీరోయిన్ గా ప్రతాని రామకృష్ణ గౌడ్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. గుండు హనుమంత రావు, రజిత ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటించారని కూడా చాలామందికి తెలియదు. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ లేడీ గెటప్ లో కనిపించి తన నటనతో మెప్పించడం గమనార్హం.
 
ఉదయ్ కిరణ్ తర్వాత రోజుల్లో ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలవగా ఉదయ్ కిరణ్ మరణం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. ఉదయ్ కిరణ్ కెరీర్ పరంగా ఎదురైన ఇబ్బందుల వల్ల ఆత్మనూన్యతకు గురై మృతి చెందారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుసగా సినిమాలు హిట్ గా నిలిచి ఉంటే మాత్రం ఉదయ్ కిరణ్ కెరీర్ ప్లానింగ్ మరో విధంగా ఉండేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 
ఉదయ్ కిరణ్ మరణానికి కొంతమంది వ్యక్తులు కారణమని ఆరోపణలు వినిపించగా అందుకు సంబంధించి ఆధారాలు లేవనే సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ బ్యాగ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. ఉదయ్ కిరణ్ లా తర్వాత రోజుల్లో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన నటీనటులు చాలా తక్కువమంది ఉన్నారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
 
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం అనే సంగతి తెలిసిందే. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ సాధారణం కాగా సరైన దారిలో ముందుకెళ్తే మాత్రమే సక్సెస్ దక్కుతుంది. కెరీర్ పరంగా కొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఉదయ్ కిరణ్ మరణాన్ని తలచుకుని ఇప్పటికి కూడా ఆయన ఫ్యాన్స్ బాధ పడుతూ ఉంటారు. వ్యక్తిగత కెరీర్ విషయంలో చేసిన తప్పులే ఉదయ్ కిరణ్ మరణానికి కారణమని చాలామంది ఫీలవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: