![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allari-naresh-kithakithalu-movie-pokiri-mahes-babu5919a045-8c1b-422e-9a44-46896a0bc46d-415x250.jpg)
అల్లరి నరేష్ , గీతా సింగ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీ క్రేజ్ అందుకుంది.. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. అలాగే జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసిన పాత్రలు ఇప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. ఈ చిత్రాన్ని అల్లరి నరేష్ తండ్రి ఇవివీ సత్యనారాయణ స్వయంగా దర్శకత్వం వహించారు. లావుగా ఉన్న భార్యని వివాహం చేసుకోవడం చాలా నామోషిగా ఫీల్ అయ్యే భర్తగా ఇందులో అల్లరి నరేష్ కనిపించారు. గీతా సింగ్ కూడా తన పాత్రని ట్రోల్ చేసేలా చూపించిన కూడా చాలా చక్కగా నటించింది.
అందుకే ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని రూ .80 లక్షల రూపాయలతో తెరకెక్కించగా రూ .9కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి మంచి విజయాన్ని అందుకున్నది. ఈ చిత్రం 2007 జనవరి 1న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే కేవలం కామెడీతోనే ఈ సినిమాని మంచి విజయాన్ని అందుకున్నారు అల్లరి నరేష్. ఈ సినిమాకి ముందు పోకిరి సినిమా కూడా విడుదలయ్యిందట. అలా ఒకవైపు పోకిరి లాంటి మాస్ కమర్షియల్ సినిమాతో అల్లరి నరేష్ తన కామెడీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాని టర్నింగ్ పాయింట్ అయ్యింది అల్లరి నరేష్ కు.