సీనియర్ నటుడు నరేష్ విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.నరేష్ సీనియర్ నటి విజయనిర్మల తనయుడు అనే సంగతి మనకు తెలిసిందే.ఇక నరేష్ గత రెండు మూడు సంవత్సరాలు నుండి మీడియాలో చాలా హాట్ టాపిక్ గా ఉంటున్నారు.ఈయన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న పవిత్ర లోకేష్ తో ఎఫైర్ పెట్టుకోవడంతో వీరి మేటర్ కాస్త మీడియాలో పెద్ద వైరల్ అయింది. ఇక ఇప్పటికి కూడా పవిత్ర లోకేష్ నరేష్ లకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే అలాంటి సీనియర్ నటుడు నరేష్ ఇప్పటికే సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు. హీరో మొదలు తండ్రి,తాత వంటి క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు.అయితే అలాంటి సీనియర్ నటుడు నరేష్ కేవలం హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు లాంటి పాత్రలు మాత్రమే కాకుండా లేడీ గెటప్ వేసుకుని కూడా అందరిని అలరించారు.

 మరి ఇంతకీ సీనియర్ నటుడు నరేష్సినిమా కోసం లేడీ గెటప్ వేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోలు కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా కథ డిమాండ్ చేస్తే నెగిటివ్ పాత్రలతో పాటు లేడీ గెటప్స్ వేసుకోవడానికి కూడా వెనకాడరు. అలా మన ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన ఏఎన్ఆర్, సీనియర్ ఎన్టీఆర్,చిరంజీవి, కమల్ హాసన్ , బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, రాజేంద్రప్రసాద్, మంచు మనోజ్,మోహన్ బాబు వంటి ఎంతో మంది హీరోలు లేడీ గెటప్ లలో కూడా నటించారు.అయితే వీరందరిలో సీనియర్ నటుడు నరేష్ కూడా ఒకరు.

ఈయన చిత్రం భళారే విచిత్రం సినిమా కోసం లేడీ గెటప్ లో అలరించారు. ఈ సినిమాలో శారీ కట్టుకొని హాట్ ఆంటీలా నటించారు. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా జంబలకడిపంబ సినిమాలో లేడీ గెటప్ వేసుకోక పోయినప్పటికీ అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారో అలాంటి పాత్రలో నటించారు. అలా సీనియర్ నటుడు నరేష్ వేసుకున్న లేడీ గెటప్ ఫోటోలు ఇప్పటికి కూడా నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక ఇప్పటి జనరేషన్లో లేడడీ గెటప్స్ వేసుకోవడానికి చాలామంది హీరోలు వెనకడుగు వేస్తారు.కానీ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం తన తాజా మూవీ లైలా కోసం లేడీ గెటప్ లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: