![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-24971ef7-f20e-4a0b-9568-c97bf54a67a6-415x250.jpg)
ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా విడుదల కానుంది. సంబరాల ఏటిగట్టు సినిమా పాన్ ఇండియా సినిమాగా సెప్టెంబర్ 25, 2025 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదల అయింది. ఆ వీడియోలో తేజ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. తేజ్ ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు అని మూవీ మేకర్స్ అన్నారు. ఆ టీజర్ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారు. మెగా హీరో రామ్ చరణ్ ఈవెంట్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పై ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.
అయితే ఇటీవల సాయి తేజ్ నంద్యాల జిల్లాలోని అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లాడు. అక్కడ స్వామివారిని దర్శించుకుని, పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి సినిమాలలో మంచి ఫాలోయింగ్ ఉందని అన్నారు. దయచేసి తనని సినిమాల నుండి దూరం చేయవద్దని చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులను హ్యాపీగా ఎంటర్ టైన్ చేయడం తనకి ఇష్టమని తెలిపాడు. ఇక తేజ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాతో తేజ్ మంచి హిట్ అందుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.