![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/kingdom-65f2fb9d-5e9e-497c-8c59-c606345d43c7-415x250.jpg)
అయితే కింగ్ డమ్ మూవీ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో ఉన్న అనుబంధం వల్లే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అయితే తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అయితే సొంతం చేసుకోకపోవడం గమనార్హం.
ఈ రీజన్ వల్లే తారక్ గతంలో కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ అందించే అవకాశం వచ్చినా సున్నితంగా ఆ ఆఫర్లను రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను కింగ్ డమ్ మూవీ బ్రేక్ చేస్తుందా అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
కింగ్ డమ్ సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఒకటి కాగా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కింగ్ డమ్ సినిమాలో కథ, కథనంలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో కింగ్ డమ్ మూవీ ఒకటి గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.