![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/akhil-28676d26-4fcc-4cb6-a235-c8a086509042-415x250.jpg)
టాలీవుడ్లో అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా తండేల్. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా కి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు రాబడుతుంది. మరి ముఖ్యంగా టాలీవుడ్ కి అన్ సీజన్ అయిన ఫిబ్రవరి నెలలో కూడా ఈ సినిమా అదిరిపోయే స్థాయి లో వసూళ్లు రాబట్టటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తండేలు తెరకెక్కింది. ఎట్టకేలకు అక్కినేని హీరోలకు కొన్ని ఏళ్ల పాటు వరుస డిజాస్టర్ సినిమాల తర్వాత నాగచైతన్య తండేల్ రూపంలో సాలిడ్ హిట్ దక్కింది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రు. 80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం మేజర్ ఎఫెక్ట్ గా నిలిచింది. అలాగే నాగచైతన్య - సాయి పల్లవి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇది ఇలా ఉంటే వరుస ప్లాపుల తర్వాత అక్కినేని ఫ్యామిలీ హీరోలకు తండేల్ హిట్ ఇచ్చింది. చైతు ఎట్టకేలకు ఒక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్కడి వరకు బానే ఉంది. వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న చైతు తమ్ముడు అఖిల్ ఎప్పుడు ? హిట్టు కొడతాడు అలాగే నాగార్జునకు ఎప్పుడు హిట్టు వస్తుంది .. ఈ ఇద్దరు హీరోలు హిట్టు కొట్టేందుకు ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి. ఏ డైరెక్టర్ ... ఏ సినిమాతో వీళ్ళకి హిట్ ఇస్తాడు అన్నది రోజులు నెలలు లెక్కపెట్టుకుని మరి అక్కినేని అభిమానులు ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి.