- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఆమె ప్రస్తుతం హీరో నితిన్ సరసన రాబిన్ హుడ్ - మాస్ మహారాజా రవితేజ సరసన మాస్ జాతర సినిమాలలో నటిస్తోంది. ఆమె ఈ ఇద్దరు హీరోలతోనూ గతంలో నటించారు. రవితేజ సరసన‌ ధమాకా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించిన శ్రీలీల .. నితిన్ కి జోడిగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె నటిస్తున్న ఈ రెండు సినిమాలపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. కచ్చితంగా శ్రీలీల‌ ఈ రెండు సినిమాల తో వరుస విజయాలు అందుకోవటం ఖాయమని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ఇక శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి శ్రీలీల‌ ఓ సినిమా చేయనుంది.


ఈ సినిమాను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు శ్రీలీల మరో బాలీవుడ్ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ శ్రీలీల నటించబోతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా తన మొదటి సినిమా మొదటి కాకుండానే రెండో సినిమాకు ఓకే చెప్పటం .. అది కూడా క్రేజ్ ఉన్న కుర్ర హీరో సరసన కావడంతో శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి నిజంగానే శ్రీలీల బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆ సినిమాలు హిట్ అయితే కచ్చితంగా ఆమెకే క్రేజ్ ఎక్కడో ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రి శ్రీలీల లైఫ్ ఎలా ట‌ర్న్ అవుతుందో ?  చూడాలి. మ‌రి శ్రీలీల దూకుడు ఇలాగే కొన‌సాగితే ఖ‌చ్చితంగా ర‌ష్మిక దూకుడుకు బ్రేకులు త‌ప్ప‌వు.

మరింత సమాచారం తెలుసుకోండి: