యంగ్ హీరో విశ్వక్ సేన్ విభినమైన స్టోరీలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే అలాంటి విశ్వక్ సేన్ నటించిన తాజా మూవీ లైలా..ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ పాత్రలో కూడా మెప్పించబోతున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేసిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న లైలా మూవీ కోసం చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున చేసి ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా చిరంజీవి,అనిల్ రావిపూడి వంటి ఎంతోమంది స్టార్లను ఆహ్వానించారు. అయితే అలాంటి విశ్వక్ సేన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి బయట పెట్టారు.మరి ఇంతకీ విశ్వక్ సేన్ ని బురిడీ కొట్టించిన ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

విశ్వక్ సేన్ తాజాగా లైలా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లవ్ బ్రేకప్ స్టోరీ కి చెప్పారు.ఆయన మాట్లాడుతూ.. నేను 24 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను.కానీ మూడు సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ బ్రేకప్ అయ్యింది. 27 ఏళ్లకే బ్రేకప్ అవ్వడంతో నేను చాలా బాధపడ్డాను. 27 ఏళ్లకే నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం అంటే నా బ్రేకపే.. ఇక టీనేజ్ లో ఉన్న వాళ్ళు చాలామంది ఏ అమ్మాయిని చూసినా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కానీ అది నిజమైన ప్రేమ కాదు.. సీరియస్ రిలేషన్ చెప్పుకుంటారు కానీ అది కొంతవరకు మాత్రమే నిజం. ఇక బ్రేకప్ నుండి బయటపడ్డాక పూర్తిగా నా కెరియర్ మీదే ఫొకస్ పెట్టాను. 

ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉంది. ఇక మంచి అమ్మాయి దొరికినప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ విశ్వక్ సేన్ తన లవ్ బ్రేకప్ స్టోరీ గురించి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే కన్నీళ్లు పెట్టుకుంటేనే ఆ బాధ నుండి బయట పడతాం అంటూ ఆ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే విశ్వక్ సేన్ తను 24 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డాను అనే విషయం చెప్పారు కానీ ఆ అమ్మాయి ఎవరో ఆమె పేరు మాత్రం బయట పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: