![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/natural-star-nanis-hi-nanna-dada84fb855a-2c12-4a57-818f-297f8cde5687-415x250.jpg)
ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఫిబ్రవరి 20న ప్యారడైజ్ గ్లింప్స్ వస్తుందని అంటున్నారు. ఇదిలాఉంటే నాని ప్యారడైజ్ సినిమా లో హీరోయిన్ ఎవరా అన్న డిస్కషన్ ఒక రేంజ్ లో జరుగుతుంది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలని చూస్తుంది.
నాని ప్యారడైజ్ సినిమాలో కీర్తి సురేష్ కాకపోతే మరో హీరోయిన్ ఎవరా అన్న డౌట్ మొదలవుతుంది. ఐతే నానితో కీర్తి సురేష్ అయితేనే బెటర్ అంటున్నారు ఫ్యాన్స్. కీర్తి కి పెళ్లైనా సరే సినిమాలు మానేయాలనే రూల్ ఏమి పెట్టుకోలేదు. భర్త సపోర్ట్ కూడా ఫుల్లుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ప్యారడైజ్ లో కీర్తి ఉంటే మాత్రం ఆమె ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. ప్యారడైజ్ సినిమాను నాని రెండు భాగాలూఅ తీస్తాడనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. నాని ప్యారడైజ్ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో మొదలై నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. హిట్ 3 తర్వాత నాని ప్యారడైజ్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.