- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా హంగామా మొదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమాకు కింగ్ డ‌మ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా అఫీషియల్ టీజర్ విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అదేవిధంగా హిందీలో రణబీర్ కపూర్ ... తమిళంలో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు వరకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది ఇంకా చెప్పాలి. అంటే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినిపించకపోతే .. ఈ టీజర్ ఈ పాటికి తేలిపోయి ఉండేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఎందుకంటే ఇందులో కనిపిస్తున్న విజువల్స్ ఇంతకుముందు దేవర - సలార్ - కేజీఎఫ్ లాంటి సినిమాలలో చూసినట్టుగా ఉన్నాయని అంటున్నారు. ఇంకా ఇందులో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అనిరుధ్‌ రవిచంద్ర ఇప్పటికే కొన్ని సినిమాలకు అందించినట్టుగా ఉందని .. సో ఉన్నంతలో కొత్తగా అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మాత్రమే అంటున్నారు.


ఇక విజయ్ దేవరకొండ చిన్న హెయిర్ తో కాస్త డిఫరెంట్ గా కనిపించాడు. అతడు చెప్పిన మొత్తం తగలబెట్టేస్తా అనే డైలాగు లో అంత డెప్త్‌ కనిపించకపోయినా ఉన్నంతలో బాగుందని అంటున్నారు. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం అని అరివీర భయంకరమైన ఎలివేషన్ తో విజయ్ దేవరకొండ ను ప్రజెంట్ చేయటం బాగుంది. ఓవరాల్ గా టీజర్ లో ఎమోషనల్ తో పాటు వైలెన్స్ కనిపించింది. ఈ సినిమాను స్పై థ్రిల్ల‌ర్ గా గతంలో చెప్పారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. మే 30న కింగ్డమ్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: