- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నాగచైతన్య - సాయి పల్లవి కాంబినేషన్లో తెర‌కెక్కిన సినిమా తండేల్ సినిమాకు మంచి బ‌జ్‌ వచ్చింది .. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఐదు రోజులకు 80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అయితే సోమవారం నుంచి మళ్లీ డౌన్ ట్రెండ్ లోకి వెళ్లిపోయింది. సినిమా మండే నాటికి నిలబడుతుందా నిలబ‌డదా ? అన్న అనుమానాలు ముందు వినిపించాయి. సోమవారం ఓ మాదిరిగా ఉండేసరికి పర్వాలేదు అనుకున్నారు. మంగళవారం నుంచి డ్రాప్ అవ్వటం మొదలుపెట్టింది. అదృష్టం కొద్ది అదనపు రేట్లు ఉండటం వల్ల అమౌంట్ కాస్త ఎక్కువ కనిపిస్తున్నాయి. 100 కోట్ల పోస్టర్ వేస్తామని టీం ధీమా గా ఉంది .. కానీ కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. శని .. ఆదివారాలు మళ్ళీ బాగుంటాయి అని లెక్కలు వేసుకుంటున్నారు.


ఇది పక్కన పెడితే మంచి టాక్ వచ్చిన సినిమా వీక్ డేస్ లో ఎందుకు స్ట్రాంగ్ గా ఉండటం లేదు అన్నదే ప్రశ్న. టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. ఓ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే తర్వాత వచ్చే 3 - 4 వారాల పాటు సినిమాలో అంతగా ఆడవు. ఈసారి సంక్రాంతికి రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు సినిమాలు కలిపి దాదాపు రు . 500 కోట్ల వ‌సూళ్లు కళ్ళ చూశాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల జనాలు కలిపి రు . 500 కోట్ల రూపాయలు సినిమాల మీద ఖర్చు చేశారు. మరి మళ్ళీ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు అన్న‌ది కూడా చూసుకోవాలి. ఏదేమైనా తండేల్ సినిమా రు. 100 కోట్ల పోస్ట‌ర్ వేసేందుకు చాలా అడ్డంకులు వ‌స్తున్న‌ట్టుగా ఉంది. మ‌రి తండేల్ జోరుకు బ్రేక్ ప‌డ‌డానికి కార‌ణం ఫిబ్ర‌వ‌రి అన్ సీజ‌న్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా ? అన్న‌ది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: