రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజా సాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా రెండేళ్లుగా సెట్స్ మీదే ఉంది. ఇప్పటివరకు రాజా సాబ్ సినిమా నుంచి గ్లింప్స్, ఇంకా మోషన్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా యూనిట్ పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారు.

రాజా సాబ్ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఏంటో ఎవరికీ అర్ధం కావట్లేదు. అసలైతే ఈ ఇయర్ సమ్మర్ అంటే ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా రిలీజ్ వాయిదా అన్నట్టే తెలుస్తుంది. ప్రభాస్ సైడ్ ఇచ్చాడనే సిద్ధు జాక్ ఆ రోజున రిలీజ్ అవుతుంది. ఇక దసరా, దీపావళికి ఆల్రెడీ సినిమాల రిలీజ్ లు కన్ ఫర్మ్ అయ్యాయి.

చూస్తుంటే మళ్లీ డిసెంబర్ దాకా రాజా సాబ్ ని లాగిచ్చే లాగా ఉన్నారు. రాజా సాబ్ సినిమా అవుట్ పుట్ ఎలా ఏంటన్నది పక్కన పెడితే ఈ యూనిట్ ఫ్యాన్స్ ని అసలు పట్టించుకోవట్లేదన్న అసంతృప్తి అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అందుకే సినిమా లేట్ అయినా ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ఇస్తుందని చెబుతున్నారు. మరి రాజా సాబ్ రిలీజ్ ఎప్పుడు.. సినిమా అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు అన్న దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్సినిమా తర్వాత ఫౌజీ, స్పిరిట్ సినిమాలు చేయాల్సి ఉంది. వాటితో పాటు సలార్ 2, కల్కి 2 ఇలా చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి ఒక సినిమాకే ఇంత లేట్ చేస్తే ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతారన్న విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: