![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/samantha56669e06-208e-495f-a65a-4bc59052a88f-415x250.jpg)
నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఇప్పుడు దూరం దూరంగా బ్రతుకుతున్నారు. రీసెంట్ గానే శోభిత ధూళిపాళ్లని రెండో పెళ్లి చేసుకొని అక్కినేని అభిమానులకి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చాడు నాగ చైతన్య. అయితే రీసెంట్గా "తండేల్ " సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు నాగ చైతన్య . "తండేల్" సినిమా హిట్ అవ్వడానికి పూర్తిగా కారణం నాగచైతన్య నటన ..సాయి పల్లవి పర్ఫామెన్స్ కానీ రీసెంట్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాగార్జున.." శోభిత ధూళిపాళ్ల మా ఇంటికి కోడలుగా అడుగుపెట్టడం కారణంగానే తండేల్ హిట్ అని చెప్పుకొచ్చాడు".
ఆ ఒక్క మాట నాగచైతన్య ఫ్యాన్స్ నే కాదు సమంత అభిమానులను సైతం బాధపడేలా చేసింది. గతంలో సమంత కారణంగా నాగచైతన్య ఎన్నో సినిమాలు హిట్ కొట్టాడు . కానీ ఎప్పుడూ నువ్వు ఈ మాట చెప్పలేదు సమంత - నాగచైతన్యలకు నువ్వే విడాకులు ఇప్పించినట్టు ఉన్నావే అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . అంతేకాదు సమంత ఈ విధంగా బాధపడటం న్యాయం కాదు అని.. సమంత పై పరోక్షకంగా ఇలాంటి కౌంటర్స్ వేయడం మంచిది కాదు అంటూ చెబుతున్నారు. మరికొందరు గతంలో నిన్ను ఎంత బాగా చూసుకుంది తండ్రిలాగే భావించి నీ హెల్త్ పట్ల కేర్ తీసుకుంది మరి అలాంటి కోడలికి ఇలాగానే రెస్పెక్ట్ ఇచ్చేది అంటూ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు..!