- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలలో నటించాడు. అలాగే చాలా బ్లాక్ బస్టర్ సినిమాలను ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ గత ఎడారి చివర్లో దేవర‌ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వారు 2 సినిమాతో పాటు అలాగే దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తన కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను చేజేతుల రిజెక్ట్ చేశారు. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఎన్టీఆర్ కెరీర్ లో మరో రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు పడినట్లు ఉండేది.


ఆ రెండు సినిమాలకు ఏవో కావు. కొన్నేళ్ళ క్రితం కోలీవుడ్ హీరో సిద్ధార్థ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. అయితే ముందుగా ఈ కథను బొమ్మరిల్లు భాస్కర్ ఎన్టీఆర్ కి వినిపించారు. ఈ కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. ఈ కథలో యాక్షన్స్ స‌న్ని వేశాలు .. భారీ డైలాగులు లేవు. అప్పట్లో ఎన్టీఆర్ వరుస పెట్టి మాస్ యాక్షన్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందుకే కథ నచ్చిన ఎన్టీఆర్సినిమా రిజెక్ట్ చేశారు. ఇక బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర. రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్‌గా దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ముందుగా బోయపాటిసినిమా కథను తారకకు చెప్పగా తార‌క్ రిజెక్ట్ చేయ‌గా ర‌వితేజ చేసి హిట్ కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: