![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/balakrishna723795fb-070f-4aab-abe6-76737c2d5b26-415x250.jpg)
నందమూరి నటసింహ బాలకృష్ణ గత ఏడాది తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మకల సినిమాతో తెరంగ్రేటం చేశారు. బాలయ్య హీరోగా నటించిన తొలి సినిమా సాహసమే జీవితం. ఇది 1984 లో విడుదల అయింది. అలాగే బాలయ్య కెరీర్లో 25వ సినిమా 1986లో వచ్చిన నిప్పులాంటిమనిషి .. అలాగే 1990లో వచ్చిన నారీ నారీ నడుమ మురారి సినిమా బాలయ్య కెరీర్లో 50వ సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా కు కోదండ రామిరెడ్డి దర్శకుడు. అలాగే 1999 లో వచ్చిన కృష్ణ బాబు బాలయ్య కెరీర్ లో 75వ సినిమాగా వచ్చింది. ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకు దర్శకుడు. ఇక బాలయ్య 100వ సినిమా 2017 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు క్రిష్ దర్శకుడు.
ప్రస్తుతం బాలయ్య 109 సినిమాలలో నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న అఖండ 2 తాండవం బాలయ్య కెరీర్లు 110 సినిమాగా తెరకెక్కుతోంది. బాలయ్య పౌరాణికం - జానపదం - సాంఘికం - సైన్స్ ఫిక్షన్ - బ యోపిక్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక టాలీవుడ్ అగ్ర నటుడుగా చరిత్రలో నిలిచిపోయారు. బాలయ్య డ్రీమ్ రూల్స్ ఏమిటని ప్రశ్నించుకుంటే మంగోల్ దండయాత్ర నాయకుడు చెంగిస్ ఖాన్ .. అలాగే గోన గన్నారెడ్డి - రామానుజ చార్య ఈ మూడు పాత్రలు బాలయ్యకు కెరీర్ పరంగా డ్రీమ్ రూల్స్. బాలయ్య తన 50 సంవత్సరాల జర్నీలో గౌతమీపుత్ర శాతకర్ణి కోసం ఎక్కువగా కసరత్తులు చేశారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం అత్యధిక గెటప్పులలో కనిపించారు.