![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/lion7ff17c57-34b1-470c-9af0-718e1dfc631b-415x250.jpg)
నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సూపర్ డూపర్ హిట్ సినిమా లతో దూసుకు పోతున్నారు. ఈ యేడాది సంక్రాంతి కి డాకూ మహారాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య సూపర్ హిట్ తన ఖాతా లో వేసుకున్నారు. అఖండ తో మొదలు పెడితే ఆ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి - భగవంత్ కేసరి .. తాజాగా డాకూ మహారాజ్ ఇలా నాలుగు వరుస హిట్లు బాలయ్య ఖాతా లో పడ్డాయి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ 2 తాండవం సినిమా లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటిన్యూ గా షూటింగ్ పూర్తి చేసి ఈ యేడాది దసరాకు థియేటర్ల లోకి తీసుకు రానున్నారు.
ఇదిలా ఉంటే బాలయ్య కెరీర్ లో డాకూ మహారాజ్ సినిమా 109వ సినిమా. అఖండ 2 తాండవం సినిమా 110వ సినిమా కావడం విశేషం. బాలయ్య కెరీర్ లో ఆయన నటించిన 71 సినిమాలు సెంచరీలు ఆడాయి. అందులో ఇటీవల కాలంలో వచ్చిన డిజాస్టర్ సినిమా లయన్ తో పాటు యావరేజ్ సినిమా డిక్టేటర్ సైతం 100 రోజులు ఆడాయి. లయన్ సినిమా అయితే నందమూరి ఫ్యాన్స్ సినిమా ల సెంచరీలకు అడ్డా అయిన చిలకలూరిపేట లోని శ్రీ రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది.
ఇక డిక్టేటర్ అయితే ఉత్తరాంధ్ర లోని విజయనగరం జిల్లా లోని చీపురుపల్లి లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక బాలయ్య బ్లాక్ బస్టర్ లెజెండ్ అయితే రాయలసీమలో రెండు థియేటర్ల లో 400 రోజులు ఆడగా.. ఓ థియేటర్లో ఏకంగా 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఇక బాలయ్య అఖండ 2 తాండవం సినిమా తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తర్వాత సినిమా చేస్తారు.