అక్కినేని నాగార్జున, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యల రిలేషన్ షిప్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున ఇద్దరు వారసులతో పెద్దవాడైన నాగ చైతన్య, మొదటినుండీ తనకు అనువైన కథలనే ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇక నాగ చైతన్య తాజాగా 'తండేల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసుకున్నాడు. చే చేసిన సినిమాలలో ముఖ్యంగా ఏమాయ చేసావె, 100% లవ్, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, మజిలి, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలు మంచి పేరుని తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం చైతన్య చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు 25కి పైనే సినిమాలు చేశారు. అయితే చైతూకు నటన పరంగా పెద్ద స్కోప్ ఉన్న సినిమాలు పడలేదనే చెప్పాలి. అయితే ఇన్నేళ్లకు 'తండేల్'తో చై నటన గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు. తండేల్ మూవీలోని లవ్, ఎమోషనల్, దేశభక్తి సీన్లలో చైతూ పెర్ఫామెన్స్ అదిరిపోయిందని క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'తండేల్' చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయగా సదరు ఈవెంట్ కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో తన కొడుకు నటన గురించి చాలా సంతోషం వ్యక్తం చేశారు నాగార్జున.

ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. "చైతన్య తండేల్ చిత్రంలో అద్భుతంగా చేసాడు. ప్రతి సీన్ లో జీవించాడు. చందు మొండేటి చైతూలోని దాగిఉన్న నటుడిని బయటికి తీసుకొచ్చాడు!" అని సంతోషం వ్యక్తం చేశారు. దాంతో నాగ్ మాటలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి చాన్నాళ్ల తరువాత నాగార్జున పెద్ద వారసుడు చైతన్య గురించి మాట్లాడినందుకు అక్కినేని అభిమానులు అయితే ఖుషీ అయిపోతున్నారు. ఇలాంటి మరెన్నో విజయాలు చైతూను వరించాలని, డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయాలని నెటిజన్లు సైతం ఇపుడు కోరుకోవడం గమనార్హం. ఇకపోతే తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరనుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించగా, అల్లు అరవింద్ ప్రజెంట్ చేశారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: