మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే హీరోస్ హీరోయిన్స్ ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాలి . అఫ్ కోర్స్ డైట్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఉంటారు . కానీ వందలో తొంబై శాతం మంది పూర్తిగా డైట్ ఫాలో అవుతారు . ఆ విషయం అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ ఎక్కువగా డైట్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు.  అయితే ప్రెసెంట్ ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబుల పేర్లు ఇండస్ట్రీలో ఎలా మారు మ్రోగిపోతున్నాయి అన్న విషయం అందరికీ తెలుసు .


రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా పూర్తిగా జంగల్ అడ్వెంచర్స్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల షూట్ కంప్లీట్ అయింది . త్వరలోనే చిత్ర బృందం ఆఫ్రికా అడవుల్లో కనిపించబోతున్నారు,  ఈ అడవుల్లో దాదాపు నెల 10 రోజుల పాటు షూట్ చేయబోతున్నారట . కాగా ఇలాంటి క్రమంలోనే రాజమౌళి డైట్ విషయంలో మహేష్ బాబుకు పెట్టిన కండిషన్స్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది . మామూలుగానే మహేష్ బాబు ఫుల్ డైట్ లో ఉంటాడు . ఏది పడితే అది తినడు అని లిమిటెడ్ పోర్షన్స్ లోనే తింటాడు.



 అయితే రాజమౌళి ఇంకా డైట్ ని కంట్రోల్ చేసేసారట.  స్ట్రిక్ట్ గా మార్చేశారట రోజుకి 7 లీటర్ల నీళ్లు తాగడంతో పాటు కోకోనట్ వాటర్ .. ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోమంటూ సజెషన్స్ ఇచ్చారట . అంతేకాదు మార్నింగ్ ఫోర్ కే లేవాలి 2 గంతలు యోగ లేదా ఎక్సర్సైజ్ చేయాలి .. ఒక గంట వాకింగ్ చేయాలి.. ఆ తర్వాత కుండలో రాత్రంతా నానబెట్టుకున్న నిమ్మకాయ తేనె నీళ్లు తాగాలి .. ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి .. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మహేష్ బాబు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి .



పూర్తిగా మహేష్ బాబు ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు.  కానీ అది లిమిటెడ్ పోర్షన్స్ లోనే ఉండాలి . ఆ తర్వాత సరిగ్గా 11 గంటలకి నానపెట్టిన బాదం పప్పులు .. వాల్నట్స్ పంప్కిన్  సీడ్స్ ఇలాంటివి తీసుకోవాలి . ఆఫ్టర్నూన్ లంచ్ కి మాత్రం కచ్చితంగా రాగిసంగటి ఆయనకి ఇష్టమైన కర్రీ ఏదైనా కావచ్చు . కాకపోతే వితౌట్ ఆయిల్ తోనే ఆ ఫుడ్ తీసుకోవాలి . అంతేకాదు ఆఫ్టర్నూన్ ఏదైనా జ్యూస్ లేదంటే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు . రాత్రి డిన్నర్ మాత్రం ఆరులోపు కంప్లీట్ చేసేయాలి . అది కూడా కచ్చితంగా న్యాచురల్ ఫుడే ఉండాలి.



బాయిల్ చేయకూడదు హీట్ చేయకూడదు గ్యాస్ మీద పడిన పదార్థం ఏది తినకూడదు.  మొత్తంగా నాచురల్ ఫుడ్ తినాలి. ఫ్రూట్స్ జ్యూసెస్ నట్స్ ఇలాంటివి . అంతేకాదు చీట్ మీల్ లేదు . చీట్ మీల్ లేకుండానే డైట్ మొత్తం ఫాలో అవ్వాలి . వీటితోపాటు స్కిన్ కి సంబంధించిన రకరకాల ఫేస్ లో గ్లో  తెప్పించడానికి రకరకాల ఫేషియల్ వ్యాయామాలు చేయాలి. ఇది తెలుసుకున్న జనాల షాక్ అయిపోతున్నారు.  మా మహేష్ బాబుని ముప్పు తిప్పలు పెట్టేస్తున్నావే జక్కన్న అంటూ మాట్లాడుతున్నారు. అయితే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: