![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rashmika-vs-sai-pallavi-who-is-number-one-in-pan-india-level75d10d02-0b2d-4ca1-a3d6-5090103ea0e4-415x250.jpg)
ఇక రెండు భారీ విజయాలను తన ఖాతాలు వేసుకుని వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించింది .. అదేవిధంగా ఈ సినిమాలతో కూడా రష్మిక భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంది .. బాలీవుడ్ స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంది .. గొప్ప నటిగా విమర్శకుల ప్రశంసలు కూడా తెచ్చుకుంది. ఇలా రష్మిక కెరియర్ ఎలాంటి వడిదలు లేకుండా వెళ్ళిపోతుంది .. ఇదే క్రమంలో సాయి పల్లవిని తక్కువ చూడలేం .. తనకు వచ్చిన ఎన్నో అవకాశాలని కాదనుకొని సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది .. రష్మికలా గ్లామర్ గేట్లు ఓపెన్ చేస్తే అవకాశాలు పరంగా రష్మికనే దాటిపోతుంది .. ఇందులో ఎలాంటి సందేహం లేదు .. కానీ తనకు అంటూ కొన్ని పరిమితులు పెట్టుకుని ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతుంది ..
అయినా కూడా గొప్ప గొప్ప అవకాశాలు సాయి పల్లవి దగ్గరకు వస్తున్నాయి. రీసెంట్ గానే తండేల్ సినిమాతో మరో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంది .. అలాగే బాలీవుడ్ డెబ్యు ఏకంగా రామాయణం సినిమాతో అక్కడ అడుగుపెడటం మరో గొప్ప విషయం .. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న అందరి హీరోయిన్లను పక్కనపెట్టి మరి సీత క్యారెక్టర్ కు సాయి పల్లవి అని ఎంపిక చేసుకున్నారు .. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు . బాలీవుడ్ లో సాయి పల్లవి ప్రయత్నించకుండానే గొప్ప అవకాశం వచ్చింది .. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి ఉత్తరాదిని కూడా క్రేజ్ అందుకుంటుందని సిని విశ్లేషకులు అంటున్నారు.