- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ హీరో నితిన్ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ చూసి చాలా కాలం అయింది. 2020 లో వ‌చ్చిన భీష్మ సినిమా బ్లాక్ బస్టర్ ఆ తర్వాత వరుసగా చేసిన చెక్ - మ్యాస్టో ( ఓటీటీ ) - మాచర్ల నియోజకవర్గం - ఎక్స్ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కొన్ని సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర నితిన్ మార్కెట్ గట్టిగా డ్యామేజ్‌ చేశాయి. దీంతో నితిన్ మళ్ళీ తన కెరీర్ ట్రాకు లోకి తెచ్చుకునే విషయంలో చాలా కష్టపడుతున్నాడు. తనకు భీష్మ తో హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్‌హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శివరాత్రికి రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఫుల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతోంది. వకీల్ సాబ్ సినిమా తీసిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ తమ్ముడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.


ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ లయ ఈ సినిమాలో నితిన్ కు అక్కగా నటిస్తోంది. మే 9 న‌ తమ్ముడు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తమ్ముడు సినిమా సింగల్ రిలీజ్ కాదు .. అదే రోజున మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా కూడా థియేటర్లలోకి దిగుతుంది. సితార నిర్మిస్తున్న ఈ సినిమాకు భాను భాగం భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌కుడు. అటు రవితేజ కి కూడా గత కొంతకాలంగా సక్సెస్ లేదు. 2020లో వచ్చిన ధమాకా తర్వాత అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా మిస్టర్ బ‌చ్చ‌న్ - ఈగ‌ల్‌ అతిపెద్ద డిజాస్టర్లు. ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే రోజు తమ్ముడు మాస్ జాతర రెండు సినిమాలు పోటీ ఆసక్తిగా మారింది. సాలిడ్ హీట్ కోసం చూస్తున్న ఇద్దరు హీరోలకు పర్ఫెక్ట్ సమ్మర్ ప్లాట్ అయితే దొరికింది. మరి ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: