![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-d8754ee9-bc58-445d-bb6a-c7db3d92a35f-415x250.jpg)
అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ విడుదల అయ్యిందో.. లేదో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో ఈ మూవీ టీజర్ కు 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అలాగే డైలాగ్స్ ఉంటాయని మూవీ మేకర్స్ తెలిపారు. ఇక టీజర్ చూడగానే విజయ్ అభిమానులు బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా వేసవి సెలవులలో మే 30న రిలీజ్ అవ్వనుంది.
ఇదిలా ఉండగా ఇటీవలే రష్మిక మందన్న ఈ మూవీ టీజర్ గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో ఆమె.. 'ది మ్యాన్ కమ్స్ విత్ సమ్‌థింగ్ మెంటల్.. విజయ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది' అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. గత రెండు మూడేళ్లుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సినీ నటి రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి ఒకే చోట ఉన్నట్టుగా నెటిజన్స్ ఇప్పటికే చాలా ఫ్రూప్స్ చూపించారు. ఇక వీరిద్దరి పెళ్లి చేసుకుంటారని ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఈ ప్రచారాలపై స్పందించారు కూడా. ఈ విషయంపై సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని తెలిపారు. ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడు ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుందో అప్పుడు బయటపెడతానని చెప్పుకొచ్చారు. రష్మికతో డేటింగ్ పై క్లారిటీ ఇవ్వాలంటే ఒక సమయం, సందర్భం రావాలని ఇంటెలిజెంట్ గా రిప్లై ఇచ్చారు.