![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/vishwak-sen-laila-movie-break-even6e77c862-594e-4703-be23-0aea2aed6077-415x250.jpg)
ముఖ్యంగా ఇటీవలే పొలిటికల్ పరంగా కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడంతో టికెట్ల బుకింగ్స్ వల్ల కొంతమేరకు దెబ్బ కూడా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ సినిమాకి నిర్మాత సాహూ గరికపాటి 35 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే లైలా సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా థియేటర్ రైట్స్ కు డిమాండ్ బాగానే ఉందని ఆంధ్ర నైజాం ఏరియాలలో రూ .6 కోట్లకు అమ్ముడు పోగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 14 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. మిగతా రాష్ట్రాలలో ఓవర్సీస్ లో అన్ని కలుపుకుంటే 2.5 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరిగిందని
అంటే మొత్తం మీద 8.2 కోట్ల రూపాయల వరకు లైలా చిత్రానికి బిజినెస్ జరిగినట్లు ట్రెండ్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి లైలా సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబడితేనే లాభాలలో వచ్చినట్లు వినిపిస్తోంది. ఒకవేళ సినిమా టాక్ కనుక బాగా ఉంటే ఈ డబ్బులు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదని కూడా ట్రెండ్ నిపుణులు తెలియజేస్తున్నారు. మరి విశ్వక్ సేన్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.