![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rajinikanth-cant-do-that-role-rgv-sensational-commentsa9d42845-39f3-442d-981e-a419b2e60c93-415x250.jpg)
స్లో మోషన్స్ లేకపోతే రజినీకాంత్ స్టార్ అయ్యేవాడు కాదు! సినిమాలు ఆయనకి సెట్ అయ్యేవి కాదేమో! అన్నట్టుగా వర్మ మాట్లాడడంతో రజనీ అభిమానులు వర్మపై మండిపడుతున్నారు. ఓ స్టార్‌కి, ఓ యాక్టర్‌కి చాలా తేడా ఉంటుందని, స్టార్ అనే వాడు ఏం చేయకపోయినా కేవలం స్లో మోషన్స్‌తో గట్టెక్కిస్తారని, సినిమా మొత్తం స్టార్ ఏం చేయకపోయినా ఆ స్లోమోషన్స్‌తోనే హైప్ వస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే సత్యలో బిక్కు పాత్రకు అలా చేయలేం అని, అటువంటి పాత్రలు రజినీకాంత్ చేయలేదు అన్నట్టు మాట్లాడాడు. కాగా ఆర్జీవీ వ్యాఖ్యలపై రజినీ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆయన గొప్ప యాక్టర్ అన్న విషయం నీకు తెలీదా? వెళ్లి ఆయన సినిమాలు చూసుకో! తలైవా గొప్ప స్టార్! అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటికి వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇపుడు చాలామంది కాచుకు కూర్చున్నారు.
అయితే వర్మకు ఇటువంటి స్టేట్మెంట్స్ కొత్తేమీ కాదు. నిరంతరం ఇలాంటి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ విషయానికొస్తే, వర్మ ఎప్పుడూ మెగా ఫ్యామిలీ మీద సెటైర్లు వేస్తూ పబ్బం గడుపుతూ ఉంటాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వారి మీద ఊరికే సెటైర్లు వేస్తూ టైం పాస్ చేస్తూ... మందుకొడుతూ చిందులు తొక్కుతూ ఉంటాడు. ఈ మధ్య ఎక్కువగా బన్నీని పొగిడే క్రమంలో మెగా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అయితే వర్మ వేసే ట్వీట్లను బయటి జనాలు, ఇండస్ట్రీ జనాలు ఎక్కువగా పట్టించుకున్న పరిస్థితిలోలేరు. ఎందుకంటే వర్మ ఇపుడు సినిమాలు లేక నానా అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వర్మ జాతీయ మీడియాతో మాట్లాడిన మాటలు నెట్టింట్లో అగ్గి రాజేస్తున్నాయి.