బాక్సాఫీస్ వార్‌లో ఒక సినిమా వచ్చి పెను సంచలనం సృష్టిస్తే ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది తర్వాత వచ్చే సినిమాల మీద ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు .. ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో రాక్ స్టార్ య‌శ్ హీరోగా వ‌చ్చిన కేజీఎప్‌ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెను సంచలనాలు సృష్టించింది .. ఇక ఈ సినిమా దాటకి బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం షేక్ అయిపోయిందని చెప్పాలి .. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా యావత్ ఇండియన్ పరిశ్రమ మొత్తాన్ని షేక్ చేసి పడేసింది .. కన్నడ చిత్ర పరిశ్ర‌మ‌లో సరైన దర్శకులు ఎవరు లేరు అంటూ వచ్చే కొన్ని విమర్శలకు ప్రశాంత్  నిల్ కే జి ఎఫ్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్ర‌మ అంటే ఇండియన్ చిత్ర పరిశ్రమకు చూపించాడు . అయితే ఇప్పుడు ఈ సినిమా  ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోనే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాలు వచ్చియి ..


 అయితే ఈ సినిమా దాదాపు కే జి ఎఫ్ సినిమాను పోలి ఉంటుంది . ఈ రెండు సినిమాలలో హీరోయిజం ఎజెండాగా పెట్టుకుని దర్శకులు సినిమాలు చేశారు .. అలాగే హీరో క్యారెక్ట‌రైజేషన్ కూడా రెండు సినిమాల్లో చ‌ట్ట‌ వ్యతిరేక పనులు చేస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు .. తద్వారా సినిమాకు భారీ రేంజ్ రావటమే కాకుండా ఈ రెండు సినిమాలు ఇండియన్ చిత్ర పరిశ్రమను షేక్‌ చేశాయి. ఈ విషయం గమనించిన చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పుష్పరాజ్ , రాఖీ బాయ్ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది .. ఒకరి బిజినెస్ కి మరొకరు అడ్డుపడితే ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేది చూడాలని ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు .. పుష్పరాజ్ వర్సెస్ రాఖి భాయ్ ఈ ఇద్దరి మధ్య ఓ యుద్ధమే ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది.


అలాంటిది వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎవరు ఎవరిపై పై చేయి సాధిస్తారనిది కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటుంది .. ప్రధానంగా ఇద్ద‌రు కూడా చట్ట వ్యతిరేక బిజినెస్ లు చేయడంలో ఆరితేరిన హీరోలు అలాగే టాలెంట్ లో కూడా ఇద్దరూ టాప్ రేంజ్ లో ఉంటారు .. ఎదుటివారు ఎలా ఆలోచిస్తారో కూడా పసిగట్టే చెప్పగలే కెపాసిటీ ఉన్న వీళ్ళిద్దరూ శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంటారు .. వాళ్ళ మెంటాలిటీ ప్రకారం చూసుకున్న శారీరకంగా చూసుకున్న ఇద్దరు సమానమే కాబట్టి వీళ్లకు ఫైట్ ఉంటుంది .. మరి ప్రేక్షకులు అనుకున్నట్టుగానే ఈ రెండు ప్రాత‌ల‌ తో సినిమా వస్తుందా లేదా అనేది కాలమే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: