![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/allu-arjuna2258202-e54f-4ad6-9f96-f38ace41b1b0-415x250.jpg)
అయితే ఇలా లేడీ గెటప్ వేసిన స్టార్ హీరోలలో అల్లు అర్జున్ మాత్రం ఎంతో స్పెషల్.. మెగా కుటుంబం నుంచి చిరంజీవి మేనల్లుడుగా, దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ కొడుకుగా టాలీవుడ్ లో గంగోత్రి సినిమాతో హీరోగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు .. తన తొలి సినిమానే స్టార్ దర్శకుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించాడు .. మొదటి సినిమాతో ఎన్నో విమర్శలు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక పాటలు లేడీ గెటప్ లో కనిపించి మొదటి సినిమాలోని తనలోని వైవిధ్యమైన నటుడిని చూపించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సునీల్ తో ఒక పాటలో అమ్మాయి గెటప్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు.
ఇలా మొదటి సినిమాతో ఎన్నో విమర్శలు అందుకున్న అల్లు అర్జున్ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండియన్ చిత్ర పరిశ్రమలోని నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.. మళ్లీ దాదాపు 20 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి లేడీ గెటప్ లో కనిపించి ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ పై తన నట విశ్వరూపం చూపించాడు. తాజాగా వచ్చిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గంగామా జాతర సాంగ్లో అమ్మవారి అవతారంలో లేడీ గెటప్ లో తన నట విశ్వరూపం చూపించాడు .. ఈ సినిమాతో తనలోని కొత్త అల్లు అర్జున్ ప్రేక్షకులకు చూపించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడిగా నిలిచాడు. అయితే ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా లైలా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో విశ్వక్ కూడా లేడీ గెటప్ లో నటించాడు .. దీంతో టాలీవుడ్ లో లేడీ గెటప్పుల్లో నటించిన హీరోలకు సంబంధించిన విషయాలు మరోసారి వైరల్ గా మారాయి.