![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/star-herobb711cf9-afd3-46f3-80c0-46ce7a8e7bc8-415x250.jpg)
ప్రజెంట్ రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా కేవలం టికెట్ ధరలు పెంచుకొని రెండు వారాల్లో దుకాణం సద్దేసుకుంటున్నారు .. ఒక నిర్మాతకు సినిమా ఆడితే వారి డబ్బులు వాళ్లకు వస్తాయి .. కానీ ఇక్కడ నష్టపోతుంది మాత్రం థియేటర్ యాజమాన్యమే .. నిలువల్ల స్వార్థం నింపుకున్న టాలీవుడ్ ప్రముఖులం వీటి గురించి మాత్రం ఎక్కడా ఆలోచించరు .. ఇలా మన టాలీవుడ్ లో గతంలో ఎన్నో సినిమాలు సంవత్సరాలు తరబడి ఆడేవి .. అయితే అతి తక్కువగా ధియేటర్లో కేవలం ఐదు రోజులు మాత్రమే ఆడిన ఓ సినిమా అరుదైన రికార్డును అందుకుంది .. ఇదేదో గతంలో జరిగిన విషయమైతే కాదు రీసెంట్గా జరిగింది .
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా కేవలం ఐదు రోజులు థియేటర్లో ఆడింది .. ఐదో రోజు నుంచి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక టికెట్ కూడా తెగలేదు ఇది ఏ స్థాయి ప్లాప్ సినిమాను అందరూ అర్థం చేసుకోవచ్చు .. సినిమాను కరుణ కుమార్ తెర్కక్కించాడు .. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది .. 2024 నవంబర్ 14న రిలీజ్ అయింది .. ఈ సినిమాతో వరుణ్ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ఘోరమైన డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ..