![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-balayya71382efd-fd73-477f-be6c-91813c9cf297-415x250.jpg)
కానీ బాలయ్య మాత్రం తన నటనతో తన డైలాగ్ డెలివరీతో అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాడు . కాగా ఇప్పుడు బాలయ్య ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోక పక్క ఆహాలో అన్ స్టాపబుల్ చేయడానికి ఒప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు బాలయ్య తరహాలోనే వెంకటేష్ సైతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడానికి పక్కా ప్లాన్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు. అంతేకాదు ప్రముఖ ఓటిటి సంస్థతో టై అప్ చేసుకొని ఆయన కూడా హోస్టుగామారిపోతున్నారట .
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వెంకటేష్ ప్రముఖ ఓటిటి సంస్థతో ఒక టాక్ షో కి హోస్ట్ గా మారబోతున్నారట. ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు . వెంకటేష్ హోస్ట్ గా మారబోతున్నాడు . గతంలో చాలామంది హీరోస్ పోస్ట్ గా అవతారం ఎత్తరు . బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్ - నాని - చిరంజీవి - రానా దగ్గుబాటి లాంటి వాళ్లు హోస్టుగా మారి తమలోని టాలెంట్ ని చూపించారు . ఇప్పుడు వెంకటేష్ ఆ లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు అని తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు. మరొక పక్క బాలయ్యకి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడే అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ బాలయ్య - వెంకటేష్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!