ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో గొప్ప విజయం సాధించాడు. ఈయన అంతర్జాతీయ స్థాయిలో అభిమానుల ప్రేమను తన సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తీసిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. పుష్ప 2  మూవీ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇచ్చింది. అలాగే స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అన్నీ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ ఓ పాటలో వేసిన అమ్మవారి గెటప్ కి మాత్రం ఫాన్స్ పెరిగిపోయారు.. ఆ పాటలో ఆయన యాక్టింగ్ కి ప్రశంసల వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా రష్మిక మందన్న నటించింది. ఆమె కూడా భార్య పాత్రకు నిలువెత్తు రూపంగా నిలిచిందని అంటున్నారు.
అయితే, ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా తెరపైకి రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో జూలాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్ సినిమాలను అందించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా త్వరలో తెరకెక్కనున్నట్లు.. అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. శివుడి కుమారుడు కార్తీకేయుడిగా హీరో బన్నీ ఈ చిత్రంలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా గాడ్ ఆఫ్ వార్ గా కార్తికేయుని ప్రయాణం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీని సోషల్ మీడియా వేదిక అయిన ఇన్ స్టాగ్రామ్ లో 28.5 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న తొలి దక్షిణ నటుడిగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. కానీ బన్నీ మాత్రం ఇన్ స్టాలో ఒక్కరినీ మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆ ఒక్కరూ ఎవరు అని ఆలోచిస్తున్నారా.. తన భార్య స్నేహ రెడ్డి. అల్లు అర్జున్ కేవలం స్నేహరెడ్డి మాత్రమే ఫాలో అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: