తెలుగు అందాల నటుడు శోభన బాబు అంటే అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు .. అలాగా అప్పుట్లో ఉన్న హీరోయిన్లు కూడా శోభన్ బాబుతో న‌టించ‌డం కోసం ఎంతో ఇష్టపడేవారు .. శోభన్ బాబుతో నటించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు .. కానీ వారిలో కొందరు హీరోయిన్లతో శోభ‌న్‌ బాబు ప్రేమాయణం నడిపించార‌నే వార్తలు ఇప్పటికి వస్తున్నాయి. మరి ముఖ్యంగా తమిళనాడు దివ‌గ‌బంత‌ మ‌జీ ముఖ్యమంత్రి జయలలిత - శోభన్ బాబు వ్యవహారంపై ఎన్నో వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతూ వస్తున్నాయి .. ఇదే క్రమంలో జ‌య‌లలితను , శోభన్ బాబు పెళ్లి చేసుకున్నాడని సీక్రెట్ గా కాపురం చేసే పిల్లలు కూడా కన్నారని ఎలా రకరకాలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.


ఇక జయలలిత , శోభన్ బాబు కు ప్రేమగా భోజనం వడ్డిస్తున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి .. కానీ వీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా ? పిల్లల్ని కంటే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు .. జయలలిత చనిపోయిన తర్వాత కూడా వారు బయటకు రాకపోవడానికి అసలు కారణమేంటి ? ఈ విషయంలో రకరకాల వార్త‌లు బయటికి వస్తున్నాయి అసలు .. జయలలిలతో , శోభన్ బాబు రహస్యంగా కాపురం చేశారండానికి ఎలాంటి సాక్షాలు కూడా లేవు. అంతేకాకుండా వీరికి పిల్లలు పుట్టారని ముఖ్యంగా వారికి ఒక ఆడపిల్ల ఉందని .. ఆమెను జయలలిత ఎంతో రహస్యంగా పెంచారని ఇలా రకరకాల గాసిప్లు వస్తున్నాయి .. ఈ ఇద్దరు అగ్రస్టార్‌లు  కలిసి చాలా సినిమాల్లో నటించారు .. ఎంత క్లోజ్ గా ఉండేవారు. అయితే ఇదే నిజమైతే జయలలిత తన వారసురాలిగాను లేక తన దగ్గరి వ్యక్తిగానో చూసుకుంటూ ఆమెకు ఎలాగో నిజమైన వారసురాలిగా చేసేది కదా.  ఎక్కడో క్యాసెట్ సెంటర్ నడుపుకునే శశికళను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువచ్చిన జయలలిత తన కూతురిని కింద వదిలేయదు కదా..?


వీరిద్దరికి నిజంగా కూతురు ఉండి ఉంటే జయలలిత చనిపోయిన తర్వాత అయినా బయటికి వచ్చేది కదా .. ఇలా ఎన్నో ప్రశ్నలు శోభన్ బాబు , జయలలిత పేరు చెబితే సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎలాంటి నిజాలు లేవు ఫేక్ వార్తలు గానే మిగిలిపోయాయి. అంతేకాకుండా అప్పట్లో జయలలిత , శోభన్ బాబు మనసు పడటం నిజమే అంటారు శోభన్ బాబు తో ఎక్కువ సినిమాలు చేయడానికి కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపించే వారట .. కానీ అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్న శోభన్ బాబు , జయలలితను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు .. దాంతో జయలలిత జీవితాంతం ఒంటరిగానే ఉండిపోయిందని ఆమె అలా ఉండటానికి కారణం ఇదే అంటారు  .  ఇదే క్రమంలో ఇందులో మరో వాదన కూడా ఉంది శోభన్ బాబు , జయలలిత పెళ్లికి రెడీ అయ్యారని .. కానీ అప్పుడు జయలలిత పొలిటికల్ గా సినిమాల పరంగా ఎంతో దగ్గరగా ఉండే మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ వీరి పెళ్లి జరగకుండా ఆపారని టాక్ కూడా ఉంది .. అయితే ఇందులో ఏది నిజమో తెలియదు కానీ వీరి బంధం గురించి మాత్రం ఇప్పటికీ క్యూస్షన్ మార్క్ గా మిగిలిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: