తెలంగాణ, ఏపీలలో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు కేవలం కోళ్లకు మాత్రమే వచ్చిన బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు మనుషులలో కూడా వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదు అయింది. ఏలూరులో ఓ వ్యక్తికి చేసిన వైద్య పరీక్షలలో బర్డ్ ఫ్లూ వైరస్ పాజిటివ్ వచ్చింది. ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫారంకు దగ్గరలో ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు కనిపించాయి.


దీంతో అతనికి వైద్య పరీక్షలు చేయడంతో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఈ వ్యాధి సోకడం వల్ల ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ నమోదు కావడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని ఏలూరు జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని ఈ విషయాన్ని తెలియజేశారు.


ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు ఏలూరులోని బాదంపూడిలో కిలోమీటర్ మేర ఇన్పెక్టెడ్ జోన్ గా అధికారులు వెల్లడించారు. 10 కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్ గా విధించారు. కాగా, బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బకు ఎవరు చికెన్ తినడం లేదు.


దానిని తినడానికే భయపడుతున్నారు. ఈ వైరస్ సోకడంతో కోళ్ల ధరలు విపరీతంగా తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో కేజీ చికెన్ ధర రూ. 45 గా ఉంది. ఇక తెలంగాణలో కూడా ఈ విషయం తెలిసిన వెంటనే చికెన్ ఎవరూ కూడా తినడం లేదు. కనీసం కోడిగుడ్డు తినడానికి కూడా విపరీతంగా భయపడుతున్నారు. కొన్ని రోజులపాటు చికెన్ ఎవరూ కూడా తినవద్దని రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు అనౌన్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: