నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఒక సినిమా నుంచి మరో సినిమాకు అంచనాలు పెంచుకొంటూ వెళ్తున్నారు. ఇటీవల కాలంలో హీరోగానే కాకుండా నిర్మాతగా తన సత్తాను చాటుకొంటున్నారు. తొలి సినిమా నుంచి వైవిధ్యమైన కంటెంట్, హైలీ టెక్నాలజీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సినిమా నిర్మాణం విషయంలో తన తాతకు తగిన మనవడు అనే ఫీలింగ్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. అయితే నందమూరి కల్యాణ్ రామ్ రెండేళ్ల కిందట బింబిసార చిత్రంతో బ్లాక్‍బస్టర్ సాధించారు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత గతేడాది అమిగోస్ నిరాశపరిచింది. గతేడాది చివర్లోనే డెవిల్ చిత్రంతో కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి పాజిటివ్ టాకే వచ్చినా కలెక్షన్లు పెద్దగా రాలేదు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్ రామ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా NKR 21 చేస్తున్నారు. ఇది భారీ బడ్జెట్‍తోనే రూపొందుతోంది. తాజాగా ఈ ఎన్‍కేఆర్21 సినిమా క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. దీనికి భారీగానే ఖర్చు పెట్టారు మేకర్స్.ఎన్‍కేఆర్ 21 క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని మూవీ టీమ్ వెల్లడించింది. హైదరాబాద్ శివార్లలో సుమారు 30 రోజుల పాటు క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. ఈ క్లైమాక్స్‌ భారీగా రూపొందింది. దీని కోసం విశాలమైన ప్రదేశంలో భారీ సెట్ వేశారు. ఈ సెట్‍ను బ్రహ్మకడలి డిజైన్ చేశారు. క్లైమాక్స్ కోసం కల్యాణ్ రామ్ కొన్ని రిస్కీ స్టంట్స్ కూడా చేశారని సమాచారం.

ఇదిలావుండగా మొన్నామధ్య దీనికి ‘మెరుపు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా అటాక్ వచ్చింది. కానీ దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని షాకింగ్ న్యూస్ లు బయటకి వచ్చాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు పెరిగిపోయాయట. ముందుగా ఈ సినిమాని రూ.40 కోట్ల బడ్జెట్లో ఫినిష్ చేయాలి అనుకున్నారు.కళ్యాణ్ రామ్ మార్కెట్ కి అది తగిన బడ్జెట్. కానీ సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే అది రూ.55 కోట్లు దాటేసింది అనేది లేటెస్ట్ టాక్. దీంతో నిర్మాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అని టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి నిర్మాతగా పెట్టే బడ్జెట్ అంటూ ఏమీ ఉండదు. డేట్స్ ఇచ్చి.. ప్రమోషనల్ కి ఎంతో కొంత పెడతాడు. సో నిర్మాతకి డబ్బు అడ్జస్ట్ అయితే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవకాశాలు లేవు అని స్పష్టమవుతుంది.ఇక ఎన్‍కేఆర్ 21 చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. ఐపీఎల్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. సోహాలీ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ కీరోల్స్ పోషిస్తున్నారు. మొత్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఉండనుంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్స్ పతాకాలపై అశోక్ వర్దన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరి చూడాలి ఇది ఎటువైపుకు దారితీస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: