రాజమౌళి.. ఓ పాన్ ఇండియా డైరెక్టర్ . ఓ స్టార్ డైరెక్టర్ . సినిమాని సినిమాగా తెరకెక్కించే ఒక నిజాయితీ గల డైరెక్టర్.  ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  అయితే రాజమౌళి స్టార్ హీరోలను ఏ విధంగా వర్క్ విషయంలో టార్చర్ చేస్తాడు అనేది అందరికీ తెలుసు . మరీ ముఖ్యంగా రాజమౌళి ఫుడ్ డైట్ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు . రాజమౌళి స్టార్ హీరోలు తన సినిమాలో వర్క్ చేస్తే మూమెంట్లో సపరేట్ డైట్ ని కూడా ఆయనే సొంతంగా రాయిస్తారు.


ఈ విషయం చాలామంది స్టార్ హీరోలు బయటపెట్టారు . మహేష్ బాబుకు సైతం ఆయన ఒక సెపరేట్ డైట్ రాయించి అదే విధంగా ఫాలో అయ్యేలా చూసుకుంటున్నారు.  అయితే రాజమౌళి సైతం డైటింగ్ చేస్తాడు.  కానీ ఒక ఐటమ్ కనిపిస్తే మాత్రం డైటింగ్ అంటూ పక్కన పెట్టేసి కడుపునిండా తినేస్తాడట . ఎన్ని కావాలంటే అన్ని ఇష్టంగా ఆయన లాగించేస్తాడట . ఆ ఐటమ్ మరేంటో కాదు బొబ్బట్లు . ఎస్ రానా దగ్గుబాటితో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టాడు .



రాజమౌళి కి బొబ్బట్లు అంటే చాలా ఇష్టమని .. చాలా ఇష్టంగా తింటాను అని డైట్ విషయం మరిచిపోయి మరి తినే ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కేవలం బొబ్బట్లు అని .. అది చాలా చాలా పక్కాగా చేస్తేనే తింటాను అని .. లోపల పూర్ణం ఎక్కువగా బయట పిండి పలుచగా నేతితో కాల్చిన బొబ్బట్లు అంటే తనకి చాలా చాలా ఇష్టం అంటూ బయట పెట్టాడు . ఇది తెలుసుకున్న జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు . రాజమౌళికి కూడా ట్రెడిషనల్ ఫుడ్స్ అంటే ఇష్టం ఉంటాయా..? పాన్ ఇండియా  డైరెక్టర్ అలాంటి ఫుడ్స్ ని లైక్  చేస్తాడేమో అనుకున్నాము అంటూ రాజమౌళి టేస్ట్ ని పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: