![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nidhi-agarwal7337998a-cdcf-4915-82e1-a9e81eea9817-415x250.jpg)
నిధి అగర్వాల్ మాట్లాడుతూ నేను స్టార్ కిడ్ ని కాదని అలాగే నాకు సినిమా నేపథ్యం కూడా లేదని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. నేను నటిగా ఫస్ట్ ప్లేస్ లో ఉండడమే పెద్ద విషయం అని ఆమె పేర్కొన్నారు. సినిమాల్లో ఆఫర్లు రావడమే నాకు సక్సెస్ తో సమానం అని నిధి అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ సినిమాలు చేయాలని అందరికీ ఉంటుందని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు.
నేను మాత్రం నమ్మకం ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటానని ఆమె పేర్కొన్నారు. అలాంటివాటిపై మాత్రమే దృష్టి పెడతానని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు. వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడానికి నేను హీరో కాదని నిధి తెలిపారు. నేను వరుసగా సినిమాలు చేసినా అలాంటి స్క్రిప్ట్స్ ఎంచుకుంటే విమర్శలు చేస్తారని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చారు.
అందుకే నేను గొప్ప కథలను మాత్రమే ఎంచుకుంటున్నానని నిధి అగర్వాల్ పేర్కొన్నారు. నిధి అగర్వాల్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. నిధి అగర్వాల్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. నిధి అగర్వాల్ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిధి రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి. ప్రభాస్ సెట్స్ లో చాలా ఫన్నీగా ఉంటారని నిధి పేర్కొన్నారు.