![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/movie-2eba54bf-db48-4c04-b86c-780c52fe9a9d-415x250.jpg)
ఇక సోషల్ మీడియాలో విషయానికి వస్తే.. ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయన గురించి అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇటీవలే ప్రభాస్ కి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో ఆయన చెబుతున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. అయితే ఇటీవల కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ లుక్ లో ప్రభాస్ ఏం బాలేడని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీ పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖైర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన ఫౌజీ సినిమా షూటింగ్ లో ప్రభాస్, డైరెక్టర్ తో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆ ఫోటోలో డార్లింగ్ బ్లాక్ ఫార్మల్ అవుట్ ఫిట్ లో కనిపించారు. స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని చూసిన ప్రేక్షకులు స్టైల్ అదిరిపోయింది డార్లింగ్ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు.