టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్  'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఈ స్టోరీలో పలువురు  బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించగా.. అక్షయ కుమార్, కాజల్ శివపార్వతులుగా నటించారు. మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు తదితర పాత్రలు పోషించారు. మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడు కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు. అవ్రా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కలెక్షన్ మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇదిలావుండగా ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలోనే సినిమా మొదటి కాపీ సిద్ధం కానుందని తెలుస్తోంది. 

సినిమాను విభిన్నంగా ప్రమోట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో మంచు విష్ణు చాలా ముందు నుంచే ఇలా పోస్టర్స్‌ను ఒకొక్కటి చొప్పున విడుదల చేస్తూ వస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జ్యోతిర్లింగాలను దర్శించుకోబోతున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. చాలా కాలంగా మంచు విష్ణు ఈ సినిమాపై వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కథ రచనలో మంచు విష్ణు కీలకంగా ఉన్నారు. మంచు విష్ణు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.ఇదిలావుండగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మంచు విష్ణు తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవేమిటంటే, మోహన్ బాబు బయోపిక్ తీస్తే అందులో సూర్య ను లీడ్ రోల్ లో తీసుకుంటానని, అలాగే ఆ సినిమాకు తానే నిర్మాత గా వ్యవహారిస్తానని అన్నారు.ఈ క్రమంలో నే సూర్య నటించిన కంగువ చిత్రం లో అధ్బుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయని తెలిపారు.ఆ మూవీ టీజర్ చూసి ఆశ్చర్య పోయినట్లు తెలిపారు.కాగా సూర్య, మోహన్ బాబు కలిసి ఆకాశం నీ హద్దురా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: