![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/cinema-4052ed68-a010-4545-903b-c62a6384a47c-415x250.jpg)
అయితే ఇందులో ప్రభాస్ శివుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కన్నప్ప మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. అయితే అంచనాలకు మించి ఈ సినిమాను తెరకెక్కిస్తామని కన్నప్ప టీమ్ చెప్తుంది. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా వాయిదా పడి వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. కనప్ప సినిమాలో మోహన్ లాల్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఇప్పటికే కన్నప్ప సినిమాలో ప్రభాస్ లుక్ ని కూడా విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్ర పోషించనున్నారు.
ఆ పాత్రకి ప్రభాస్, మోహన్ లాల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణుని అడిగాడు. దానికి ఆయన మాట్లాడుతూ.. 'ఈ సినిమా కోసం వాళ్లు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మా నాన్నగారు మోహన్ బాబుపై ఉన్న గౌరవంతోనే ఇద్దరు ఎంతో ఆసక్తిగా సినిమాలో నటించారు' అని చెప్పుకొచ్చాడు. వారిద్దరూ చాలా వినయంగా ఉంటారని మంచు విష్ణు చెప్పాడు.