ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది తండేల్. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా డి.మత్య్సలేశం గ్రామానికి చెందిన మత్య్సకారుల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో చైతూ, సాయి పల్లవి యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, చందు మొండేటి డైరెక్షన్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యాడు. చైతన్య కెరీర్‏లో బిగ్గెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది తండేల్.వాలెంటైన్స్ డే వీక్ కావడంతో శని, ఆదివారాల్లో అత్యధిక కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు మేకర్స్.ఇదిలాఉండగా 'తండేల్' తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. వీకెండ్ తర్వాత కూడా బలంగా నిలబడుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం 'తండేల్' ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోతోంది.తెలుగు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే కర్ణాటకలో సినిమా పర్వాలేదనిపిస్తోంది. అక్కడ రిలీజైంది కూడా తెలుగు వెర్షనే. తమిళంలో సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్ ఉన్నా, కోలీవుడ్ నటుడు కరుణాకరన్ ఓ కీలక పాత్ర చేసినా, దేవిశ్రీ కూడా అక్కడి వారికి సుపరిచితుడే అయినా.. 'తండేల్'కు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు.

హిందీలో అయితే సినిమాను మొక్కుబడిగా రిలీజ్ చేశారు. వసూళ్లు కూడా నామమాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మలయాళంలో అయితే 'తండేల్'ను రిలీజే చేయలేదు. కేరళలోని తెలుగు వారి కోసం మల్టీప్లెక్సుల్లో కొన్ని షోలు కేటాయించారంతే. మొత్తంగా చూస్తే 'తండేల్' పేరుకే పాన్ ఇండియా మూవీ. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అని చెప్పాలి.ఇక మొత్తంగా తండేల్ సినిమా వంద కోట్లు వసూళ్లు రాబడుతుందని నిర్మాత బన్నీ వాసు మొదటి నుంచి చెబుతునే ఉన్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఇక ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో తండేల్ సినిమా కచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో అడియన్స్ మనసులు గెలుచుకున్నాడు నాగచైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: