హాస్య బ్రహ్మనందం సినిమా రంగంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరుచుకున్నప్పటికీ ఆయన కొడుకును హీరోగా సెటిల్ చేయాలి అన్న కోరిక నెరవేరడం లేదు. ఇప్పటికే కొన్ని సినిమాలలో గౌతమ్ హీరోగా తనవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏమీ సక్సస్ అవ్వకపోవడంతో బ్రహ్మీ కోరిక నెరవేరడంలేదు. ఇలాంటి పరిస్థితులలో గౌతమ్ మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.


ఈవారం విడుదలకాబోతున్న ‘బ్రహ్మా ఆనందం’ మూవీ రిజల్ట్ బట్టి అతడి కెరియర్ ఆధారపడి ఉంటుంది. అయితే ఈమూవీకి ఇప్పటివరకు సగటు ప్రేక్షకులలో పెద్దగా ఆశక్తి ఏర్పడకపోవడంతో ఈ మూవీ పై క్రేజ్ ను పెంచడానికి బ్రహ్మానందం తనకున్న పరిచయాలు అన్నీ ఉపయోగిస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా ఈ మూవీకి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా చిరంజీవిని తీసుకువచ్చి ఈమూవీ పై మీడియాలో వార్తలు బాగా వచ్చేలా బ్రహ్మీ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు.


ఈవెంట్ కు వచ్చిన చిరంజీవి తనకు బ్రహ్మనందం తో గతంలో ఏర్పడ్డ పరిచయాలు గురించి వివరిస్తూ ఒక ఆశక్తికర విషయం తెలియచేశాడు. తాను జంధ్యాల దర్శకత్వంలో ‘చంటబ్బాయి’ సినిమాలో నాటిస్తున్నప్పుడు చిరంజీవి షూటింగ్ స్పాట్ కు వచ్చి జనం మధ్య నుంచుని తన వైపు చూస్తూ రకరకాల హావభావాలు ప్రదర్శిస్తున్న అతడి అతడి హావభావాలు తాన దృష్టిలో పడటంతో అతడి గురించి దర్శకుడు జంధ్యాల ను అడిగినప్పుడు అతడు ఒక కాలేజీ లెక్చరర్ అని తెలుసుకుని ఆశ్చర్య పడ్డ విషయాన్ని వివరించాడు.


ఆతరువాత బ్రహ్మమానందం ను హోటల్ కు పిలవడం వాడు చేసే మిమిక్రీని ఎంజాయ్ చేయడం జరిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆతరువాత తనకు తెలిసిన దర్శకులతో బ్రహ్మమానందం కు ఉన్న టాలెంటును గురించి చెప్పిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఆతరువాత బ్రహ్మనందం  తన టాలెంట్ తో ఎంతో ఎత్తుకు ఎదగడం తనకు ఎంతో గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ చేశాడు..    



మరింత సమాచారం తెలుసుకోండి: