హర్యానాకు చెందిన రాకీ సింగ్ టాలీవుడ్‌లో చాలాకాలం నుంచి నటిస్తున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌లో మెరిసినా, సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అయితే ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'కోబలి' వెబ్ సిరీస్‌తో రాకీ సింగ్ దశ తిరిగింది. ఈ సిరీస్‌లో మెయిన్ విలన్‌గా నటించిన రాకీ సింగ్ నట విశ్వరూపం చూపించాడు. తన స్టైలిష్ విలనిజంతో టాలీవుడ్‌కు ఒక పవర్ఫుల్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు.


డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కోబలి' ప్రస్తుతం ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. ఈ సిరీస్‌లో కంటెంట్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో, రాకీ సింగ్ విలనిజం కూడా అదే స్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో స్థిరపడిన రాకీ సింగ్ తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నాడు. కోబలిలో తన పాత్రకు డబ్బింగ్ కూడా తనే చెప్పుకుని ఆశ్చర్యపరిచాడు. పవర్‌ఫుల్ విలన్‌ పాత్రల రాకీ సింగ్ పరకాయ ప్రవేశం చేసేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో తనదైన విలనిజంతో ప్రేక్షకులను వణుకు పుట్టించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో రాకీ యాక్టింగ్ చూస్తే చప్పట్లు కొట్టకుండా ఉండలేం.


'కోబలి' వెబ్ సిరీస్‌లో రాకీ సింగ్ నటనకు విమర్శకులు సైతం జేజేలు పలుకుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌కు ఒక స్టైలిష్ విలన్ దొరికాడని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. రాకీ సింగ్ గ్లామర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విలన్ పాత్రకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాయి. చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 'పైసా వసూల్', 'జై సింహా', 'యుద్ధం శరణం' వంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు, 'కోబలి'తో రావడం విశేషం. ఒక మంచి నటుడికి సరైన అవకాశం వస్తే ఎలా సత్తా చాటుతాడో రాకీ సింగ్ నిరూపించాడు.


నింబస్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై జ్యోతి రాథోడ్, యు1 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి ఈ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేశారు. టి. శ్రీనివాసరావు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అతను ప్రొడక్షన్‌లో ఒక పార్ట్ అయిపోయారు. వీళ్లు రేవంత్ లెవక డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు.


8 ఎపిసోడ్‌లుగా, 30 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సిరీస్‌లో రవి ప్రకాష్, శ్యామల, తరుణ్ రోహిత్ కీ రోల్స్‌లో మెరిశారు. 'కోబలి' డిస్నీ+ హాట్‌స్టార్‌లో 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది, అన్ని భాషల్లోనూ ట్రెండింగ్‌లో ఉంది. మొత్తమ్మీద, కోబలిలో రాకీ సింగ్ విశ్వరూపం చూపించడంతో గుర్తింపు కోసం అతను చూస్తున్న ఎదురుచూపులకు తెర పడినట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: